schedule Saturday, August 22, 2026

గొర్రెపోతులు దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్ 

calendar_today September 12, 2024
person meenewstelugu
గొర్రెపోతులు దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్ 

గొర్రెపోతులు దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్ 

 ---వీరు పాత కేసులో నిందితులు 

 ---ద్విచక్ర వాహనాలపై గొర్రెపోతుల దొంగలించారు 

 ----కోర్ట్ హాజరు పరిశీలి రిమాండ్ కు పంపారు 

----మోతే ఎస్సై బి యాదవేంద్ర రెడ్డి, 

మోతే మండలము సింగరేణి టోల్ ప్లాజా వద్ద ఈ రోజు తెల్లవారుజామున వాహనములు తనిఖీ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు అయిన ఇండ్ల వీరేష్ తండ్రి లేట్ శ్రీనివాస్, గ్రామము చంద్రన్న కుంట. సూర్యాపేట పట్టణము మరియు భూతరాజు నాగరాజు తండ్రి లేట్ నర్సయ్య,గ్రామము స్నేహానగర్ లు కలిసి పల్సర్ ద్విచక్ర వాహనంపై ఒక గొర్రె పోడేలును ద్విచక్ర వాహనల మధ్యలో పెట్టుకొని ఖమ్మం వైపుకు వెళ్లుచుండగా అనుమానస్పదంగా కనిపించగా పట్టుబడి చేసి వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనం ఒక గొర్రె పోడేలు మరియు రెండు గొర్రె పిల్లలను స్వాధీనం చేసుకోవటం జరిగింది.వీరు పెన్ పహాడ్ గ్రామములో పల్సర్ వాహనం, ఖమ్మం త్రి టౌన్ పరిదిలో స్ప్లెండర్ ప్లస్ వాహనం ,విభులపురం పరిదిలో ఒక గొర్రె పోడేలు,పిల్లలమర్రి గ్రామ పరిదిలో రెండు గొర్రె పిల్లలను దొంగి లించినారు.వీటితో పాటు సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ పరిదిలో, గంజాయి, బ్యాటరీలు పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్నారు.వీరిని అరెస్టు చేసి వారిని కోర్టు ముందు హాజరపరిచిన మోతే ఎస్సై బి యాదవేంద్ర రెడ్డి, రిమాండ్కు పంపినట్లు తెలిపారు