schedule Saturday, August 22, 2026

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్ సి బి గ్రాండ్ విక్టరీ 

calendar_today June 1, 2026
person meenewstelugu
ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్ సి బి గ్రాండ్ విక్టరీ 
 

ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ

ఫైనల్లో కోహ్లి అద్భుత ప్రదర్శన

75 దుమ్మురేపిన విరాట్ కోహ్లి

వరుసగా రెండోసారి కప్పు కైవసం

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్ సి బి గ్రాండ్ విక్టరీ  అంతారం గ్రామ యూత్ సభ్యులు వేడుకలు 

మీ న్యూస్ తాండూర్ ప్రతినిధి ::

 బెంగుళూరు ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచిన ఆర్ సి బి ఈసారి కూడా మళ్లీ సరికొత్త రికార్డు తిరగరాశారు.గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చేదించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ విన్నర్‌గా నిలిచింది. ఒకవైపు GT తరపున వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నా, కింగ్ విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిసి హాఫ్ సెంచరీతో RCBని విజేతగా నిలబెట్టాడు. ఈ చారిత్రాత్మక విజయంతో కోట్లాది మంది అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ *ఈ సాలా కప్ నమ్దే* నినాదాన్ని నిజం చేస్తూ RCB రెండవసారి IPL ట్రోఫీని గెలిచిన సందర్భంగా అంతారం గ్రామ యువకులు బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. యువకులు మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర తిరగరాయాలంటే అది ఆర్ సి బి కే సొంతమని పేర్కొన్నారు. ఈ వేడుకలలో అంతారం గ్రామ యువకులు పాల్గొన్నారు