సునీతమ్మ వెంట మేము- కాంగ్రెస్ ఆదేశాలను పాటించాలి: సునీత రెడ్డి- సునీతమ్మకు అండగా నిలిచిన జీవన్గి నేతలు
దీక్షతెగులున్యూస్, తాండూరు :
వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి వెంటనే మేము ఉంటామని మాణ్యిక్ రెడ్డి, నర్సిరెడ్డిలు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న గురువారం సునీత మహేందర్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ హైదరాబాద్ నగరానికి చేరుకొని సునీత రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆమె
అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి
శుక్రవారం గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ పట్నం సునీతారెడ్డి, పట్నం రినీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పట్నం ఫ్యామిలీని వెంటబెట్టుకొని అసెంబ్లీకి తీసుకెళ్లారు. సీఎం చాంబర్ లో సునీతారెడ్డి, మహేంధర్ రెడ్డి, రినీష్ రెడ్డితో ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఆ తర్వాత జీవన్గి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి వెంటనే మేము ఉంటామని వారు తెలిపారు. దీంతో సునీత రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ..ఐకమత్యంగా ఉంటూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవాలన్నారు.నారాయణ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ జగదీష్, భీమ్ రెడ్డి, మల్లికార్జున స్వామి, నాగేశ్వరరావు, జగదీష్అయ్యా,నర్సింలు, వసంతప్ప, రత్నప్ప, సంజీవ్ రావు,బాబా, పోశప్ప, తదితరులు ఉన్నారు.