వైభవంగా మల్లన్న జాతర- ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు- ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు- మహిళలు బోనాలతో ఊరేగింపు..
దీక్షతెలుగున్యూస్ ,తాండూరు :
శ్రీ మల్లిఖార్జున స్వామి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యేకు ఘనసాగతం పలుకుతూ..
డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అలయం చుట్టు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ఆలయాల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో గ్రామస్తులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్మకన్నా సొసైటీ చైర్మన్ రవి గౌడ్, వడ్డే శ్రీనివాస్, అజయ్ ప్రసాద్, నాయకులు, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.