schedule Tuesday, August 25, 2026

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవాలి.     

calendar_today November 9, 2024
person meenewstelugu
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవాలి.     

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవాలి.

    

 అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు

  ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వార్డు ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలి

     

 44వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్.

 మీ న్యూస్ ప్రతినిధి ::ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణం 44వ వార్డు లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచూ ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లు చిరునామా మార్పు, జాబితా లో ఇంటి పేరు, ఇతర సవరణ లు మరియు 1 జనవరి 2025 వరకు 18 సంవత్సరాలు నిండిన యువత కొత్త ఓటరు గా నమోదు చేసుకోవచ్చుని తెలిపారు, ఈ సందర్బంగా స్థానిక వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుచూ , నవంబర్ 9 మరియు 10 తారీకు లలో స్థానిక సిద్ధార్ధ స్కూల్ యందు blo లు అందుబాటులో ఉంటారని,ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఇట్టి అవకాశాన్ని వార్డు ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.. ఇంకా ఇట్టి కార్యక్రమం లో RDO వేణుమాధవ్, MRO శ్రీనివాస్ రెడ్డి,Ri శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ కపిల్,blo లు పద్మ, శ్యామల మరియు వార్డు ప్రతినిధులు ఇస్రర్ భాయ్, నరేంద్రుని శ్రీధర్, మన్సూర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు