schedule Tuesday, August 25, 2026

ఉద్యోగుల, నిరుద్యోగుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తా.

calendar_today November 12, 2024
person meenewstelugu
ఉద్యోగుల, నిరుద్యోగుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తా.

ఉద్యోగుల, నిరుద్యోగుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తా.

- పట్టభద్రులారా మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించండి...

- యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తా...

- భారతరాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు 

 

మీ న్యూస్ ప్రతినిధి :::

మెదక్ జిల్లా : నవంబర్12,( మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం / అంబేద్కర్ చౌరస్తా ) తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో... రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని భారత రాష్ట్ర సమితి (బీ. ఆర్.ఎస్) పార్టీ ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు హక్కుపై పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రానున్న కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని కోరారు. అనంతరం అయన మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లా కేంద్రంలో యువతకు ఒక వృత్తి నైపుణ్యం కేంద్రంతో పాటు పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికీ ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీ కృషి చేస్తానని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పని చేస్తానని, ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి వారి పక్షాన పోరాడతానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల(కే. జీ. వీ. బీ ) లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కెల్ (ఏం టి ఎస్ ) అమలు చేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల డిమాండ్ ఉందని.... వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికీ తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ ( పీ.ఆర్. సి) అమలు, డీ. ఏ పెంపు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి సమస్యలపై ప్రభుత్వం ద్రుష్టి కీ తీసుకెళ్తానని అన్నారు. ఈకార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఫోరం సభ్యులు ఎత్తి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్