ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని
calendar_today
November 30, 2024
person
meenewstelugu
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా బంద్
పిలుపు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు
తాండూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంధు పిలుపులో భాగంగా తాండూర్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో బంద్ పిలుపుని జయప్రదం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలలో అనేక ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోనికి చూస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్నారు విద్యార్థులకునాణ్యమైన భోజనం అందించలేక పేద విద్యార్థులకు సరైనటువంటి మెనూ పాటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ అయి అనేక మంది పేద విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల పైన నాణ్యమైనటువంటి విద్యను భోజనానికి మౌలిక సదుపాయలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని పెండింగ్ లో ఉన్న మధ్యాహ్నం భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించరాదని వంట షెడ్ ఏర్పాటు చేయాలని పేద పిల్లలు కార్మికుల రైతుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న సందర్భంగా విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రవేట్ పాఠశాలలో అధిక ఫీజు అరికట్టాలని డిమాండ్ ఎస్ఎఫ్ఐ తాండూర్ డివిజన్ నాయకులు నవీన్ శ్రీధర్ శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు