ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలల వైపే విద్యార్థులు
calendar_today
December 4, 2024
person
meenewstelugu
ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలల వైపే విద్యార్థులు
అప్పుల ఊబిలో చిక్కుకొని ఎందరో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగులు సాధించారు
మండల విద్యాధికారి మురళీకృష్ణ,
సీసీ కుంట జిహెచ్ఎం మాధవి
, అల్లిపూర్ పాఠశాల హెచ్ ఎం పర్వీన్
చిన్న చింతకుంట::: మీ న్యూస్ ప్రతినిధి ఎండి రఫిక్ డిసెంబర్ 3 :::: ధనవంతులను చూసి పేదవారు ప్రభుత్వ బడికి పిల్లలను పంపకుండా ప్రవేట్ పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారని మండల విద్యాధికారి మురళీకృష్ణ, సీసీ కుంట జిహెచ్ఎం మాధవి, అల్లిపూర్ పాఠశాల హెచ్ ఎం పర్వీన్ అన్నారు. చిన్న చింతకుంట మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చేయూత నందించిన దాతల అభినందన సభ కార్యక్రమానికి ఎం ఇ ఓ, జి హెచ్ ఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం పర్వీన్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రఘువర్ధన్ గౌడ్, మాజీ ఎంపిటిసి ఎస్ ఎం ఐ పార్క్, ఉపసర్పంచ్ విష్ణుమూర్తి, గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యవతి మాట్లాడారు. ఎం ఈ ఓ, జి హెచ్ ఎం. మాట్లాడుతూ గుడ్డెద్దు చేను మేసినట్లు ధనవంతులను చూసి పేదలు ప్రభుత్వ బడిని వదిలి, ప్రైవేటు పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారని అన్నారు. నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఎన్నో ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. అల్లిపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్వీన్ కృషితో పాఠశాలకు అందరి సహాయ సహకారాలు అందించి నందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లిపురం గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వం పాఠశాలకు పంపించాలని వారి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్రెడ్డి, స్నేహ లతోపాటు సి ఆర్ పి లు విజయ్ సింహ, ప్రవీణ్ కుమార్, ఎం ఐ ఎస్ కవిత, వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు యువకులు స్త్రీలు పాల్గొన్నారు.