ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ
సూర్యాపేట,మీ న్యూస్,డిసెంబర్ 12: గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని పలు గురుకుల పాఠశాల మరియు కళాశాలలను ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాలకు పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు ఒక ప్రాంతంలో మంజూరైన గురుకులo అక్కడ సొంత భవన నిర్మించకపోవడం అద్దె భవనాలు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాలకు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు ఎస్సీ గురుకులంలో వాటర్ ట్యాంక్ లేకపోవడంతో డైరెక్ట్ మోటార్ సహాయంతో విద్యార్థులు నీటిని వాడుకుంటున్నారని పాఠశాల సమయానికి స్నానాలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు పాఠశాలలో డ్రైనేజీ బయటకు వెళ్లేందుకు పైప్ లైన్ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉంటుందన్నారు సరిపడ తరగతి గదులు లేవని హాస్టల్కు తరగతికి ఒకే రూమ్ ని విద్యార్థులు సద్వినియోగపరుచుకుంటున్నారన్నారు ఐదు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు తరగతి గదిలో బెంచీలు లేకపోవడంతో కింద కూర్చొని పాఠాలు వింటున్నారని వారు పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డైట్ బిల్లులను పెంచిందని అవి సరిగ్గా అమలయ్యేలా ప్రభుత్వం చొరవ చూపించాలన్నారు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించాలన్నారు టెండర్ తో గురుకులాల కు సరుకులు సరఫరా చేస్తున్నా వారు నాసిరకమైన ఆహార పదార్థాలు ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని అదే మాదిరిగా చలికాలం కావున విద్యార్థులకు వేడి నీటిని మరియు స్వెటర్లను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోత్ వినోద్ కుమార్ జిల్లా నాయకులు శ్రీను నాయక్ వినయ్ శ్రవణ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు