schedule Tuesday, August 25, 2026

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని.. ఈకో ఫాన్ సొసైటీ డిమాండ్

calendar_today December 19, 2024
person meenewstelugu
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని.. ఈకో ఫాన్ సొసైటీ డిమాండ్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లోకి వ్యవసాయాని అనుసంధానం చేయాలని.. ఈకో ఫాన్ సొసైటీ డిమాండ్

ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో బద్లాపూర్ గ్రామంలో విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలన కోసం శ్రమదానం  

ప్రజా చైతన్య ర్యాలీకార్యక్రమం నిర్వహణ

ఇకో ఫాన్ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్, 

    మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్19 :::: ఈకో ఫాన్ సంస్థ బషీరాబాద్ మండలం బాద్లాపూర్, కాసింపూర్, రెడ్డి ఘనాపూర్ గ్రామాలలో విదేశీ ఆక్రమక కలుపు మొక్కలను నిర్మూలించేందుకు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కలుపు మొక్కలు జీవ వైవిధ్యం మరియు వ్యవసాయ ఉత్పాదకతకు తీవ్రంగా ముప్పుగా నిలుస్తున్నాయని ఆ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం, ద్వార వయ్యారి భామ, సీస కమ్మరి, ఇగడ, బుడిది అళo, ముల్లపూ అళo తదితర ఆక్రమక కలుపు మొక్కల దుష్ప్రభావం పై చైతన్య పర్చడం జరిగింది, విదేశీ ఆక్రమక కలుపు మొక్కలు స్థానిక వృక్షజాలంతో పోటీ పడుతూ వ్యవసాయ ఉత్పాదకతను తగ్గించడం వల్ల కలుపు నివారణకు ఖర్చులు పెరగడం మరియు దిగుబడులు తగ్గడం వల్ల వారి జీవనోపాధికి ముప్పు కలుగుతుంది, దీని ప్రభావం రైతుల ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. విదేశీ ఆక్రమక కలుపు మొక్కలు వ్యాప్తి తో పశువులకు మేత అందుబాటు తగ్గుతుంది. కార్యక్రమంలో స్థానిక యువకులు, మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), మరియు రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు, కలుపు మొక్కలను శ్రమదానం తో తొలిగించారు, శ్రమదాన కార్యక్రమంతో పాటు, కలుపు మొక్కల నిర్మూలన అవసరాన్ని ప్రతిపాదిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (MGNREGS) కలుపు నిర్మూలన చేర్చాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు బ్యానర్లు, ప్లకార్డులతో ప్రభుత్వాన్ని ఈ విషయంపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు.విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలనను MGNREGS లో చేర్చడం ద్వారా, జీవ వైవిధ్యాన్ని కాపాడడమే కాక, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించవచ్చు, అని ఇకో ఫాన్ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్, తలారి ప్రభాకర్, అవుటి రాజశేఖర్, మహమ్మద్ షా ఫైసల్ నవీన్, శివ కుమార్, శ్రీనివాస్, సురేష్, మహేష్ పాండు అన్నారు. ర్యాలీ ముగిసిన తరువాత, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించి, వారి మద్దతును కోరారు. విదేశీ ఆక్రమక కలుపు మొక్కల నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా సమష్టి కృషి అవసరమని ఇకో ఫాన్ సొసైటీ ప్రజలకు పిలుపునిచ్చింది.