schedule Saturday, August 22, 2026

నడిగూడెంలో వ్యాసరచన పోటీలు..

calendar_today August 25, 2024
person meenewstelugu
నడిగూడెంలో వ్యాసరచన పోటీలు..

నడిగూడెంలో వ్యాసరచన పోటీలు..

8,9,10 తరగతులు చదివే విద్యా ర్థిని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు 

27 ఆగస్టు 2024 రోజున జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు హాజరుకావాలే 

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం...పి హెచ్ ఎస్ నడిగూడెం పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదివే విద్యా ర్థిని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీని వాస్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి కరివిరాల ఆదర్శ పాఠశాలకు చెందిన ఎ. తనుశ్రీ ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నడిగూడెంకు చెందిన షేక్ ఉమేరా, తృతీయ బహుమతి గురుకుల పాఠశాల నడిగూడెంకు చెందిన టి ప్రసన్నా, వకృత్వ పోటీలలో ప్రధమ బహుమతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ నాస్మిన్, ద్వితీయ బహుమతి గురుకుల పాఠశాల విద్యార్థిని పి. కృష్ణవేణి, తృతీయ బహుమతి కరివిరాల ఆదర్శ పాఠశాల విద్యార్థి షేక్ భాషిరత్ నతిష, లు గెలుపొంది బహుమతులు పొందారు. వీరు 27 ఆగస్టు 2024 రోజున జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు హాజరుకావాలని తెలియజేశారు.