schedule Saturday, June 13, 2026

పెద్దగట్టుకు ఊరేగింపుగా తరలిన మకర తోరణం

calendar_today February 15, 2025
person meenewstelugu

పెద్దగట్టుకు ఊరేగింపుగా తరలిన మకర తోరణం

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 15:: ఈనెల 16 నుంచి ఐదు రోజులపాటు జరగనున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ నుంచి స్వామివారి మకర తోరణం భారీ ఊరేగింపుతో డప్పుల మోతల నడుమ పెద్దగట్టుకు తరలి వెళ్ళింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ప్రజలకు భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతరను నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోడి శివ యాదవ్, హరీష్ యాదవ్, బత్తుల సాయి, వల్లపు రఘువీర్ యాదవ్, కోడి కృష్ణ, అన్నమయ్య రాము, నలమాధ సైదులు, చెరుకు రాము, సాయి, యేష బోయిన చందు, కోడి రాజేష్, అఖిల్, కోడి పెద్ద సైదులు,కోడి సత్యనారాయణ, వల్లపు కిషోర్, ఏశబోయిన మల్లేష్, చిన్న మల్లయ్య, చిన్న లింగయ్య, వల్లపు మహేష్ తదితరులు ఉన్నారు.