schedule Monday, August 24, 2026

భక్తులకు  జాతర లో అన్ని సౌకర్యాలు  కల్పించాలి.

calendar_today February 18, 2025
person meenewstelugu
భక్తులకు  జాతర లో అన్ని సౌకర్యాలు  కల్పించాలి.

భక్తులకు  జాతర లో అన్ని సౌకర్యాలు  కల్పించాలి.

   

⏩::జాతరలో పారిశుధ్యం తో పాటు త్రాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలి

⏩::అధికారులు తమ కేటాయించిన సెక్టారులలో పర్యవేక్షణ చేపట్టాలి

⏩::గుట్ట పరిసర ప్రాంత్రాలలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగాలి

⏩::అధికారులకు దిశానిర్దేశ్యం చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్

⏩::కుటుంబ సమేతంగా పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న కలెక్టర్ 

   

మీ న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17:: దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతరలో రెండవ రోజు చౌడమ్మకి భోనాలు సమర్పణలో భాగంగా పెద్దగట్టు దేవాలయంను ఉదయం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, యాదవ పూజర్లు మర్యాదలతో స్వాగతం పలికారు.తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు నిబద్దతతో మొక్కులు చెల్లించే భక్తులకి, వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తుల రద్దీ పెరుగుతున్నందున దేవాలయం వద్ద క్యూ లైన్, మెట్ల ద్వారా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.గుట్ట పైన, క్రింద పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే భక్తులకి త్రాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. జాతర లో అధికారులు అందరు సమన్వయంతో తమకి కేటాయించిన సెక్టారులలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వేణు మాధవరావు, తహసీల్దార్ లు శ్యామ్ సుందర్ రెడ్డి, కృష్ణయ్య,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,ప్రత్యేక అధికారులు, దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు