schedule Saturday, June 13, 2026

కుక్కడపు లక్ష్మమ్మ మృతి బాధాకరం

calendar_today February 18, 2025
person meenewstelugu

కుక్కడపు లక్ష్మమ్మ మృతి బాధాకరం

 

⏩::లక్ష్మమ్మ మృతి తో సిపిఎం పార్టీకి తీరనిలోటు.

 

⏩::ప్రజా సేవకే ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించింది 

 

 ⏩::ప్రజాసేవకే ఆమె జీవిత అంకితం చేసింది 

⏩:: ఆమె అంత్యక్రియలో పాల్గొన్న సిపిఎం నాయకులు కార్యకర్తలు 

 

 మోతే మీ న్యూస్  ప్రతినిధి::మోతె మండలం రాయి పహాడ్ గ్రామంలో కుక్కడపు లక్ష్మమ్మ గారి (80) మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు. ఆమె పార్టీకి చేసిన సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైనవి. ఆమె అంకితభావం, సామాజిక న్యాయం కోసం పోరాటం, నిరుపేదల కోసం చేసిన కృషి చిరస్మరణీయం. అని ఆమె పార్దివ దేహానికి ఎర్రజెండా కప్పి, పూలమాల వేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకత్వం ఆమె సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ కార్యదర్శి ఎర్రబోయిన మాల్సుర్, మండల కమిటీ సభ్యులు S. మల్లయ్య నాయకులు ఎలుగు మధు చేగువేరా, పొడపంగి ఈదయ్య, కొప్పు వెంకన్న, కోడి లింగయ్య,ములకలపల్లి మాల్సుర్, CPIML నాయకులు గోపగాని లింగయ్య మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..