schedule Saturday, June 13, 2026

వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు విడతలవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి

calendar_today February 19, 2025
person meenewstelugu

వ్యవసాయానికి సాగునీరు అందించాలి

⏩::విడతలవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి

⏩::సూర్యాపేట మండలం దాస్ తండా వద్ద ఎస్ ఆర్ ఎస్ పి డి బి యం -71 ను పరిశీలన

⏩::జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19:: ఎస్ ఆర్ ఎస్ పి పరిధిలోని వ్యవసాయ భూములకు విడతల వారీగా సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట మండలం దాస్ తండా వద్ద ఉన్న ఎస్ ఆర్ ఎస్ పి డి బి యమ్-71 ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి ఎక్కడెక్కడ సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడతారో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సాగు నీరు సరఫరా చేయాలని సూచించారు.మొదటి మూడురోజులు ఆత్మకూరు, సూర్యాపేట,చివ్వేంల మండలాలకు అలాగే తదుపరి మూడు రోజులు మోతే, పెన్ పహాడ్, నడిగూడెం, మునగాల మండలాల పరిధిలోని భూములకి సాగు నీరు అందించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. డి బి యమ్ -22 ద్వారా మోతే మండలానికి సాగు నీరు సరఫరా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో నీటిపారుదల సి ఈ రమేష్ బాబు, యస్ ఈ శివధర్మతేజ, ఈ ఈ శ్రీనివాసరావు, డి ఈ రమేష్, ఎ ఈ లు ఉదయ్, లింగయ్య, పాండు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.