దేవాలయ నిర్మాణాల్లో ధ్వజ స్తంభానికే విశేష ప్రాముఖ్యత
calendar_today
March 3, 2025
person
meenewstelugu
దేవాలయ నిర్మాణాల్లో ధ్వజ స్తంభానికే విశేష ప్రాముఖ్యత
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640 6595 60 మార్చి 3::దేవాలయాల్లో ఎన్ని దేవతామూర్తులను ప్రతిష్టించిన ధ్వజస్తంభం లేకపోతే దానికి ప్రాముఖ్యత ఉండదని శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నూతన జీవద్వజ పునర్ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులనుదేశించి అనుగ్రహ భాషణ ము చేశారు. మనం ఒక్కరమే భగవాన్ నామ స్మరణ ఏకమే కాకుండా పదిమందితో నామస్మరణ చేయించిన రోజునే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలుగుతామని తెలిపారు. భగవంతుడు తన శక్తినంత ధ్వజంలో లీనం చేస్తాడని అందుకే ధ్వజస్తంబాన్ని పూజించన తరువాతనే భగవంతుని దర్శించుకోవాలన్నారు. భగవంతుడు మానవ రూపంలో అవతరించిన మొదటి అవతారం వరాహ అవతారం అని, వరాహుడు భూమి నుంచి చీల్చుకొని వచ్చినందున ధ్వజస్తంభమును భూమిలో నిలబెడతామన్నారు. నరసింహస్వామి తన భక్తునికి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి దర్శనమిచ్చాడని అందుకే ధ్వజస్తంభం విష్ణుమూర్తితో సమానమన్నారు. రేవతి నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమున ఉదయం 10 గంటల ఐదు నిమిషములకు స్వామి యంత్ర ప్రతిష్ట నిర్వహించారు. వేద పండితులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ పునర ప్రతిష్ట సందర్భంగా బింబస్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజలు కళాన్యాసం, కళా హోమం, దృష్టి దేని దర్శనం, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన మహాధాశిర్వచనం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు శాంతి కళ్యాణ ము నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పలు గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి ధ్వజస్తంభన ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పరిపాలిత దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా , స్వామి జిపిఏ మాజీ పోలీసు అధికారి పానుగంటి చంద్రమౌళి,దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్త బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.