ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్
calendar_today
March 3, 2025
person
meenewstelugu
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 659560 మార్చి 3 మీ న్యూస్ ప్రతినిధి: ::జిల్లాలో మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్ మిడియేట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెం లో 2,హుజూర్నగర్ లో 2,మఠంపల్లి లో 1,నేరేడుచర్ల లో 1,తిరుమలగిరి లో 2,తుంగతుర్తి లో 2,ఆత్మకూరు (ఎస్ )మండలంలో 1 పరీక్ష కేంద్రం జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని అలాగే ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ఒక్క గంట ముందుగానే చేరుకోవాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సూచించారు.