schedule Saturday, June 13, 2026

యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోవద్దు...

calendar_today March 6, 2025
person meenewstelugu

యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోవద్దు...

⏩:::మాదకద్రవ్య రహిత జిల్లాగా సూర్యాపేట...

⏩::నషాముక్తా భారత్ అభియాన్ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ 

⏩::మీ న్యూస్ సూర్యాపేటజిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640 659560

 

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 5::యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. బుధవారం జిల్లా మహిళా , శిశు , దివ్యాంగుల & వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్ లో నషా ముక్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన్) లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశం, సమాజం అభివృద్ధి లో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మాదకద్రవ్యాలనుండి మీరు, మీ స్నేహితులు, మీ బంధువులు దూరంగా ఉండి సమాజం,దేశం అభివృద్ధి చెంది ప్రజలందరు సంతోషంగా జీవించాలని ఆకాక్షించారు. ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని వారి జీవితంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని అన్నారు.డాక్టర్ లు సమాజాన్ని కాపాడే వృత్తి లో ఉన్నందున మీ ద్వారా మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు ఎక్కువ అవగాహన పర్చాలని సూచించారు. మనమందరం కలిసి సూర్యాపేటను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు.తదుపరి విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్య రహిత జిల్లా గా మార్చేందుకు ప్రతిజ్ఞ చేశారు.ఈ సమావేశం లో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, డి యం హెచ్ ఓ కోటాచలం, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరిటీడెంట్ సత్యనారాయణ,సి ఐ రామకృష్ణ,ఎక్సజ్ ఎస్ ఐ రామకృష్ణ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు