schedule Monday, August 24, 2026

సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

calendar_today March 19, 2025
person meenewstelugu
సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

⏩::ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం

⏩::ఉద్యమ పోరాటానికి ప్రతిఫలం

⏩::అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం 

⏩::30 ఏళ్లుగా పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ 

 

మీ న్యూస్ ప్రతినిధి

::బషీరాబాద్::అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మంగళవారం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో బషీరాబాద్ మండల ఎమ్మార్పీఎస్ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమ పోరాటానికి ప్రతిఫలంగా మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.

అదేవిధంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం కోసం ఎనలేని కృషి చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ కి బషీరాబాద్ మండలం ఎమ్మార్పీఎస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎం ఎస్ పి ఉపాధ్యక్షుడు కృష్ణ, బషీరాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కొనిగేరి నర్సిములు, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణ, అంజిలప్ప, వెంకటప్ప, మల్లికార్జున్ ఆవులం నర్సప్ప, కే మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.