⏩::సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట: తొలి మహాత్మా బిరుదాంకితులు, సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల మహిళలకు చదువు ఉండాలని పడ భార్య సావిత్రిబాయి కి చదువు చెప్పించి దేశంలోని తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా తీర్చి దిద్దిన గొప్ప మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. తన జీవితాంతం బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ప్రజలను పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలైన సతి సహగమనం, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, వివక్షత, అంటరానితనం కు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. ప్లేగు వ్యాధి సోకిన బాల బాలికల కోసం అనేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి అనాధలకు ఆత్మబంధువుగా నిలిచాడని అన్నారు. అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే ఆర్థిక అసమానతలు అంతం అవుతాయని పోరాటాలు చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే నిమ్న జాతి కులాల అభివృద్ధికి మహిళ విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు పూలే అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు,జిల్లా పెళ్లి నరసింహారావు, వీరబోయిన రవి, మేకన పోయిన శేఖర్,మద్దెల జ్యోతి, మే రెడ్డి కృష్ణారెడ్డి, మేకన బోయిన సైదమ్మ,పిండిగా నాగమణి, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.