schedule Saturday, August 22, 2026

ఉత్తరా నక్షత్రం సందర్బంగా అల్పాహారం పంపిణి 

calendar_today June 5, 2025
person meenewstelugu
ఉత్తరా నక్షత్రం సందర్బంగా అల్పాహారం పంపిణి 

ఉత్తరా నక్షత్రం సందర్బంగా అల్పాహారం పంపిణి 

మీ న్యూస్ ప్రతినిధి జూన్ 4:-అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు స్వాతి దంపతులు అల్పాహారం పంపిణి చేశారు. సూర్యాపేట పట్టణంలోని వివిధ కూడళ్ళలో, దేవాలయం వద్ద ఉండే అబాగ్యులకు, నిరాశ్రయులకు అల్పాహారం, వాటర్ బాటిల్, బిస్కెట్ లు అందజేశారు. ఈ సందర్బంగా రంగు ముత్యంరాజు మాట్లాడుతూ ఈ వర్షకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు బాగా పండాలని ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొంటూ నిరాశ్రాయులకు అల్పాహారం పంపిణి చేశామన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు సేవా భావనతో పనిచేయాలని, నిరాశ్రయులను చేరా దీసి మనకు తోచిన సహాయం చేయాలనీ అప్పుడే దైవ అనుగ్రహం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో రంగు సాయిప్రీతి ఉన్నారు.