schedule Saturday, June 13, 2026

ఇంటి దారికి అడ్డంగా గోడ కట్టిన చర్చి యజమాని

calendar_today February 28, 2026
person meenewstelugu

ఇంట్లోకి వెళ్ళాలంటే గోడ దూకాల్సిందే.

•జయమ్మ 30 సంవత్సరాల క్రితం స్థలం కొనుగోలు 

•ప్రశ్నించిన స్థానికులపై కులం పేరుతో దూషించారని కేసులు పెడతాం అని బెదిరింపులకు పాల్పడుతున్నా చర్చి యజమాని.

మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ప్రతినిధి:: సూర్యాపేట జిల్లా మోతే మండలం నరసింహపురం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది, దేవరగట్ల జయమ్మ అనే మహిళ 30 సంవత్సరాల క్రితం మోతే మండలం నరసింహపురం గ్రామంలో ఇంటి స్థలం కొనుగోలు చేసి అక్కడే ఇల్లు నిర్మించుకుంది, ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన చర్చి యజమాని నిర్మాణం చేపడుతున్నాం అనే నెపంతో వారి ఇంటి ప్రక్కనే నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో చర్చి యజమాని విజయ్ స్థానికులతో చర్చి వైపు ఎవరు రావొద్దు అని హుకుం జారీ చేశాడు అంతే కాదు వృద్ధులు అయినటువంటి జయమ్మ తల్లి తండ్రిని కూడా విచక్షణరహితంగా కొట్టాడు ఇది గమనించిన స్థానికులు చర్చి యజమాని అయినటువంటి విజయ్ ని ప్రశ్నించగా కులం పేరుతో దూషించానని కేసులు పెడతానని బెదిరించడంతో దిక్కుతోచని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. తమ సమస్యను మోతే పోలీస్ స్టేషన్లో ఎస్సై ముందు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ని సంప్రదించారు అయినా కానీ 9 నెలలు గడుస్తున్న తమ సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

 
[video width="848" height="478" mp4="https://meenewstelugu.com/wp-content/uploads/2026/02/VID-20260228-WA1117.mp4"][/video]