పోట్లి మహారాజ్ దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ పక్కన ఉన్న పోట్లీ మహరాజ్ దేవాలయం అభివృద్ధి చేయడం మా లక్ష్యం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
పోట్లీ మహరాజ్ దేవాలయ రాజగోపురం, 28 నూతన దుకాణల నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోట్లీ మహారాజ్ దేవాలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. దేవాలయంలో రాజగోపురం నిర్మాణం అలాగే నూతన దుకాణాల నిర్మాణం చేపట్టడం వల్ల దేవాలయానికి అధిక ఆదాయం వస్తుంది అన్నారు. గతంలో ఉన్న పాత దుకాణాల తొలగించి వాటి స్థానంలో కొత్త దుకాణాలు నిర్మించేందుకు సహకారం అందిస్తామన్నారు గతంలో ఆలయాల అభివృద్ధికి నోచుకోలేవు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్న దేవాలయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తుంది అన్నారు. అలాగే పట్టణంలోని పలు దేవాలయాలకు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ తాడెం నరేందర్, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దేవాలయ కమిటి సభ్యులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.