శ్రీనిధి కళాశాల రెండవ టాపర్ గా నిలిచిన ధరావత్ లావణ్య
calendar_today
April 13, 2026
person
meenewstelugu
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో....
శ్రీనిధి కళాశాల రెండవ
టాపర్ గా నిలిచిన ధరావత్ లావణ్య
మీ న్యూస్ సూర్యాపేట్ జిల్లా ప్రతినిధి:::గిరిజన తండాలో.. నిరుపేద కుటుంబంలో జన్మించిన ధరావత్ బాలాజీ పద్మల కుమార్తె ధరావత్ లావణ్య ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ లో ప్రతిభ కనబరిచి కళాశాల రెండవ టాపర్ గా నిలిచింది. సూర్యాపేట మండల పరిధిలోని రూప్ల తండాకు చెందిన ధరావత్ బాలాజీ పద్మల కుమార్తె లావణ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జూనియర్ కాలేజీలో బైపిసి ప్రధమ సంవత్సరం విద్యనభ్యస్తుంది. కాగా ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక బృందంతో పాటు రూప్ల తండా సర్పంచ్ దరావత్ బిక్షం లక్షి, దరావత్ నరసింహ, నాగరాజు, తండావాసులు, బంధువులు, స్నేహితులు, లావణ్యను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.