సెప్టెంబర్ 10 నుండి 17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి
calendar_today
September 4, 2024
person
meenewstelugu
సెప్టెంబర్ 10 నుండి 17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి
వరదల వల్ల సర్వం కోల్పోయినరైతాంగాన్ని ప్రజానీకాన్ని ఆదుకోండి
అంటూ వ్యాధులు,విష జ్వరాల బారిప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలి
సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి విస్తృత సమావేశంలోసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్
సూర్యాపేట: సెప్టెంబర్ 10 నుండి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వాటిని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోనిఎస్ఆర్ఎన్ గార్డెన్ లో నిర్వహించిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా విస్తృత సాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగాసెప్టెంబర్ 10 నుండి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధం పోరాట వార్షికోత్సవ సభలునిర్వహిస్తున్నామన్నారుప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్ర తెలంగాణ సాయుధ పోరాట కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగాబిజెపిచిత్రీకరిస్తుందన్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు ముఖ్యమైన పాత్ర వశించారని అన్నారు. సాయిధ పోరాటాన్ని వక్రీకరించేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను ప్రజలంతా తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నడిపే నైతిక అర్హత బిజెపికి లేదన్నారు.నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన అత్యంత భారీ వర్షాల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వరదలు సంభవించాయని దీని మూలంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 18 మంది మరణించారని అన్నారు. ఈ విపత్తులో వరద బాధితులను ఆదుకోవడానికి పార్టీ శ్రేణులు తక్షణమే కదిలి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అసంఖ్యాక ప్రజానీకం నిరాశ్రయులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, వాగులు కట్టలు తెగడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని అన్నారు. రహదారులపైకి నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. వరదల కారణంగా అల్లాడిపోతున్న బాధిత ప్రజలను ఆదుకోవడానికి తక్షణమే ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున వాటి నివారణకు తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో గండ్లుపడిన, కట్టలు తెగిన చెరువులతోపాటు దెబ్బతిన్న రహదార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి*
అంటు వ్యాధులు, విష జ్వరాల వారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్న వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల మూలంగా ప్రజలుటైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులు మందులు, డాక్టర్ల, సిబ్బంది,కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లోఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. అంటూ వ్యాధులు,విష జ్వరాలు ప్రబలకుండా ఉన్నందుకు అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పి.హెచ్.సి సెంటర్ లలో 24 గంటలు వైద్యం అందేలా చూడాలన్నారు. అన్ని గ్రామాలలోవైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచారా వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాలకు పారిశుద్ధ్య నిధులు కేటాయించి వ్యాధులు ప్రబలకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో, పి హెచ్ సి సెంటర్లలో డెంగ్యూ నిర్ధారణ కిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. డెంగ్యూ వల్ల మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా పార్టీ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు జుట్టు కొండ వీరయ్య ఎగరవేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునగారపు పాండుఅధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలోసిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరి,పారేపల్లి శేఖర్ రావు,మే ద ర మెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, కోటగోపి తదితరులు పాల్గొన్నారు.