schedule Tuesday, August 25, 2026

వినాయకుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

calendar_today September 13, 2024
person meenewstelugu
వినాయకుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

వినాయకుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలి

34వ వార్డులో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

మీ:: న్యూస్ ప్రతినిధి 

వినాయకుడి కృప ప్రజలందరిపై ఉండి ఆనందంగా ఉండాలని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని 34వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్థానిక వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వినాయకుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈనెల 16న జరిగే నిమజ్జ ఉత్సవానికి సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీ కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రేణు బాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఇతరులు ఉన్నారు.