schedule Saturday, August 22, 2026

విలేజ్ లెవెల్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ జమీర్

calendar_today August 18, 2026
person meenewstelugu
విలేజ్ లెవెల్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ జమీర్
 

వార్డు నెంబర్ 12లో కమిటీ ఏర్పాటు

•••కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ జమీర్,

•••వైస్ ప్రెసిడెంట్లుగా లక్మన్, వడ్డే వీరన్న

 •••పట్టణ అధ్యక్షులు బాతుల నాగురాజ్ 

••••మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి,

సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు.

 

మీ న్యూస్ ప్రతినిధి ::::వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 12లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన విలేజ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, సీనియర్ నాయకులు రూఫ్ సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ జమీర్, వైస్ ప్రెసిడెంట్లుగా లక్మన్, వడ్డే వీరన్న, జనరల్ సెక్రెటరీలుగా పి. ఆశిరెడ్డి, అబ్దుల్ రెహమాన్, జాయింట్ సెక్రెటరీలుగా మాజిద్, సరస్వతి, స్పోక్స్‌పర్సన్‌గా సయ్యద్ అర్షద్ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మొహమ్మద్ జమీర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, టౌన్ ప్రెసిడెంట్🗡️ బాతుల నాగు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ప్రజలకు అందు బాటులో ఉండాలని, వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని, నాయకులు సూచించారు. ప్రజలు, పార్టీకి మధ్య వారధిగా కమిటీ పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జి. నవీన్, వి.రేణుక, బొడ్డ ఆకాష్, రాజ్ కుమార్ సింగ్, ఇలియాస్, భూపతి శారద, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.