schedule Saturday, August 22, 2026

అన్నదమ్ములతో ఆత్మీయ అనుబంధం....!

calendar_today August 19, 2026
person meenewstelugu
అన్నదమ్ములతో ఆత్మీయ అనుబంధం....!
   

కంజర్ల విజయక్క రాఖీ పండుగ సందడి...!

 గోరెపల్లి, విశ్వనాథ్ పూర్ బానాపూర్ గ్రామం...!

పల్లె పల్లెలో అన్నదమ్ములకు రాఖీ కడుతూ ఆత్మీయ అనుబంధం....!

 

    మీ న్యూస్ ప్రతినిధి యాలల::::: తాండూర్ నియోజకవర్గం,యాలాల మండలం గోరెపల్లి, విశ్వనాథ్ పూర్ బానాపూర్ గ్రామంలోకంజర్ల విజయలక్ష్మి యాదవ్ గారి రాఖీ పండుగ సందడి చేశారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అన్నదమ్ములకు రాఖీలు కడుతూ, రాఖీ పండుగ యొక్క గొప్పతనాన్ని, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని విజయక్క చాటిచెబుతున్నారు.అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అనే సందేశంతో పల్లెల్లోని ప్రతి వర్గానికి చెందిన సోదరులను ఆత్మీయంగా పలకరిస్తూ రాఖీలు కడుతున్నారు.ఇప్పటికే శ్రీమంతాలు జనని కిట్స్ కార్యక్రమాలతో గడప గడపకు వెళ్లి గర్భిణీ మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కుటుంబాల్లో సంతోషాన్ని పంచుతున్న విజయక్క… అదే ఆత్మీయతతో ఇప్పుడు పల్లె పల్లెనా అన్నదమ్ములకు రాఖీ కడుతూ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నారు.

గ్రామాల్లో విజయక్కకు లభిస్తున్న అపూర్వమైన ఆదరణ, అన్నదమ్ములు ఆప్యాయంగా రాఖీలు కట్టించుకుంటూ చూపిస్తున్న అభిమానంతో రాఖీ సంబరాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.ప్రజలతో కేవలం కార్యక్రమాలకే పరిమితం కాకుండా వారి కుటుంబాల్లో ఒక సభ్యురాలిగా, ఆడపడుచుగా కలిసిపోతూ సేవ చేయడమే విజయక్క ప్రత్యేకత అని స్థానికులు పేర్కొంటున్నారు.పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా కలుపుకుంటూ తాండూర్ కుటుంబం మనందరి కుటుంబం అనే భావనను ముందుకు తీసుకెళ్తున్న విజయక్క రాఖీ పండుగ కార్యక్రమాలు

నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.కంజర్ల విజయలక్ష్మి యాదవ్ కొనసాగిస్తున్న ఈ ఆత్మీయ రాఖీ సంబరాలు తాండూర్ పల్లెల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారాయి.ఈ కార్యక్రమంలో గొర్రెపల్లి సర్పంచ్ లక్ష్మీ మల్లేష్ ఉప జిల్లా మాజీ కోషన్స్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా ప్రకాష్ గౌడ్, అనిల్ గౌడ్, జగదీష్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు