schedule Saturday, August 22, 2026

కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

calendar_today August 10, 2026
person meenewstelugu
కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్

ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

••గర్భిణీ మహిళలకు శ్రీమంతం, బాలింతలకు జనని కిట్స్ అందజేశారు

ఫౌండేషన్ ద్వారా ప్రజలకు CPR శిక్షణ వంటి పలు సేవా కార్యక్రమాలను ఫౌండేషన్

యాలాల్‌లో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

మీ న్యూస్ ప్రతినిధి తాండూర్:::యాలాల్ మండలం కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాలాల్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఫౌండేషన్ చైర్‌పర్సన్ కంజర్ల విజయలక్ష్మి యాదవ్, విజయక్క గ్రామ గ్రామానికి వెళ్లి శ్రీమంత కానుక కార్యక్రమంలో పటు గర్భిణీ మహిళలకు శ్రీమంతం చేస్తూ తదుపరి బాలింతలకు జనని కిట్స్ అందజేశారు. అనంతరం యాలాల్ నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగులను వాడటం మానేసి, పునర్వినియోగ బ్యాగులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరఫున తయారు చేయించిన బ్యాగులను యాలాల్ ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి యాదవ్ మాట్లాడుతూ, తాండూర్ నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి వెళ్లి గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహిస్తూ, జనని కిట్స్ అందించడంతో పాటు ప్రజలకు CPR శిక్షణ వంటి పలు సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మాజీ కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా, ప్రకాష్ గౌడ్, ఉప మాజీ సర్పంచ్ గొల్ల శ్రీనివాస్ కమ్మరి శేఖర్,అమ్రేష్ ముదిరాజ్, నర్సిములు మాలిగేరి,బల్ రాజ్,చిట్లపల్లి రవి,సురేష్ మంగలి అనంతమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు