పాలిటెక్నిక్ విద్య పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు మార్గం
calendar_today
August 21, 2026
person
meenewstelugu
GO 97ను తక్షణమే ఉపసంహరించాలి!
•••పాలిటెక్నిక్ విద్యను గతంలో మాదిరిగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొనసాగించాలి
•••పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
– జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
మీ న్యూస్ ప్రతినిధి:::తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన GO 97ను ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను గతంలో మాదిరిగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని కోరారు.పాలిటెక్నిక్ విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు బలమైన మార్గం అని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో సరైన చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా విద్యార్థుల ఆందోళనలను గుర్తించి, విద్యావేత్తలు మరియు నిపుణుల సలహాలు తీసుకుని GO 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.GO 97ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టే ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం వారితో కలిసి ఉద్యమిస్తామని రాజ్ కుమార్ కందుకూరి స్పష్టం చేశారు.