schedule Monday, August 24, 2026

సీతారాం ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి 

calendar_today September 14, 2024
person meenewstelugu
సీతారాం ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి 

సీతారాం ఏచూరి మృతి పట్ల దిగ్భ్రాంతి 

--సూర్యాపేట నియోజకవర్గం

 --పెన్ పహాడ్ మండలం

---ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు

 

---కాంగ్రెస్ పార్టీ పెన్ పహాడ్ మండల అధ్యక్షులు భూముల సురేష్ రావు 

 

మీ:: న్యూస్ ప్రతినిధి 

సీతారాం ఏచూరి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ పెన్ పహాడ్ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సురేష్ రావు అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరి కి మంచి అనుబంధం ఉందని తెలిపారు. సీతారాం ఏచూరి మృతి పట్ల తూముల సురేష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.