schedule Tuesday, August 25, 2026

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

calendar_today September 21, 2024
person meenewstelugu
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

---దోమలు వలన డెంగ్యూ,, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి 

---ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు

---మురికి కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు

----గచ్చులు, మట్టి కుండలు, ట్యాంక్ లు, బకెట్ లు, డ్రమ్ము లు, లలో లార్వా లేకుండా చూసుకోవాలన్నారు. 

---వారానికి ఒకసారి ఫ్రై డే డ్రై డే ను పాటించాలి 

---టీబీ నోడల్ పర్సన్ జయప్రకాష్ 

మీ:: న్యూస్ ప్రతినిధి జోగులంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప ఆదేశాల మేరకు, రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు సారథ్యం లో రాజోలి మండలము లో 'ఫ్రైడే డ్రై డే'ప్రోగ్రామ్ ను నిర్వహించామని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ అధికారి జయప్రకాశ్ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన అన్నారు, ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. మురికి కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. గచ్చులు, మట్టి కుండలు, ట్యాంక్ లు, బకెట్ లు, డ్రమ్ము లు, లలో లార్వా లేకుండా చూసుకోవాలన్నారు. వారానికి ఒకసారి ఫ్రై డే డ్రై డే ను పాటించాలని ఆయన అన్నారు. దోమలు కుట్టకుండా రాత్రి పూట దోమ తెరలు వాడాలన్నారు.తలుపులకు, కిటికీలకు జాలీ అమర్చుకోవాలని ఆయన అన్నారు. పాత టైర్లు, టెంకాయ చిప్పలు, తదితర వాటిని ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలన్నారు.దోమలు వలన డెంగ్యూ,, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన అన్నారు,దోమలు పుట్ట కుండా, కుట్ట కుండా చూసుకోవాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు.