విద్యార్థులకు విషయ సామర్థ్యాలను పెంచాలి మండల నోడల్ అధికారి డి శివయ్య,,,
calendar_today
September 22, 2024
person
meenewstelugu
విద్యార్థులకు విషయ సామర్థ్యాలను పెంచాలి మండల నోడల్ అధికారి డి శివయ్య
మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య
నూతనకల్.. విద్యార్థులకు సబ్జెక్టు వారీగా, పరిజ్ఞానాన్ని విషయ సామర్ధ్యాన్ని ప్రాథమిక దశ నుండి పెంపొందింప చేయాలని నోడల్ అధికారి డి శివయ్య ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు లో జరగబోయే జాతీయ సాధన సర్వే లో ఉన్నత ప్రతిభ కనపరిచేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని,విద్యార్థుల హాజరు పెంచాలని పాఠశాల ప్రాధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులను సూచించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులకు స్కూల్లో వచ్చిన ఓ మార్కో చేయించి వారి విద్యాభివృద్ధి కోసం తోడ్పడాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు..