schedule Monday, August 24, 2026

ఎమ్మెల్యే చొరవతో గౌతాపూర్ అభివృద్ధి దిశగా

calendar_today February 14, 2024
person meenewstelugu
ఎమ్మెల్యే చొరవతో గౌతాపూర్ అభివృద్ధి దిశగా

ఎమ్మెల్యే చొరవతో గౌతాపూర్ అభివృద్ధి దిశగా

- గౌతాపూర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

దీక్షతెలుగు న్యూస్, తాండూరు :
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో గౌతాపూర్ గ్రామం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం సంతోషకరమైన విషయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగప్ప,, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, పటేల్ రామ్ చంద్రా రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు.తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా తదుపరి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధి పనులకోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులను విడుదల చేశారని చెప్పారు. ఎన్నడు చేయలేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అలాగే 6 గ్యారంటీలను అర్హులైనప్రతిఒక్కరుసద్వినియోగంచేసుకోవాలనిసూచించారు.ఈ కార్యక్రమంలో రాస్నం మాల్ రెడ్డి, షేక్ అజ్మద్, ఇతరులు ఉన్నారు.­