schedule Monday, August 24, 2026

తిరుమల లడ్డు వివాదంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. 

calendar_today September 23, 2024
person meenewstelugu
తిరుమల లడ్డు వివాదంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. 
  తిరుమల లడ్డు వివాదంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. 

 డాక్టర్ వేమూరి సత్యనారాయణ 

మీ::న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా    ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ ::తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి. తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించి .. అప్రతిష్ట పాలు చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి. దోషులను కఠినంగా శిక్షించాలని సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన కోదండరామస్వామి సేవా సమితి. సాంస్కృతిక & సామాజిక సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా. ఎంతో ప్రాముఖ్యత కలిగిన. తిరుమల తిరుపతి దేవస్థానంను . అప్రతిష్ట పాలు చేసే విధంగా . మహా ప్రసాదం. లడ్డు తయారీలో. కల్తీ నెయ్యి వాడి. హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని. ఆచరించే. కోట్లాది మంది. హిందువుల నమ్మకాన్ని విశ్వాసాన్ని అపహాస్యం చేసేలాగా ఇలాంటి వికృత చేష్టలకు. పూనుకోవడం బాధాకరమని అన్నారు