schedule Wednesday, August 26, 2026

తనపై కొంతమంది దుష్ప్రచారం చేయడం సబబు కాదు 

calendar_today September 23, 2024
person meenewstelugu
తనపై కొంతమంది దుష్ప్రచారం చేయడం సబబు కాదు 

తనపై కొంతమంది దుష్ప్రచారం చేయడం సబబు కాదు 

త్వరలోనే తాండూర్ కి వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తా..

జిపిఏ హోల్డర్ అబ్దుల్ రజాక్ 

మీ:: న్యూస్ ప్రతినిధి గణేష్ తాండూర్: వివాదాస్పద స్థలం సర్వే నెంబర్ 51 పై తనకు పలువురు ఫోన్ చేస్తున్నారని తాను మక్కాలో ఉన్నానని.. ఆ స్థల జిపిఏ హోల్డర్ అబ్దుల్ రజాక్ చరవాణిలో స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన చరవాణిలో మాట్లాడుతూ... హైదరాబా ద్ లో ఉన్నానని, నాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం సబబు కాదని అన్నారు. తాను నా బంధువులు, స్నేహితులు, సన్నిహితుల గురించి మక్కాలో ప్రార్ధనలు చేస్తున్నానని వివరించారు. వీడియో కూడా షేర్ చేశానని తెలిపారు. నిజానిజాలు లాయర్లు తమకు వెల్లడించడం జరిగిందని, తాండూర్ కి వచ్చిన తర్వాత మరోసారి జర్నలిస్టులతో సమావేశం నిర్వహించి అన్ని వివరాలను, విషయాలని వివరిస్తానని ఈ సందర్బంగా అబ్దుల్ రజాక్ స్పష్టం చేశారు