schedule Wednesday, August 26, 2026

రామచంద్రపురం గ్రామ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టర్కు లేక.

calendar_today September 24, 2024
person meenewstelugu
రామచంద్రపురం గ్రామ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టర్కు లేక.

రామచంద్రపురం గ్రామ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టర్కు లేక.

మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కోల రవీందర్ గౌడ్ ::సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ అయినటువంటి లాల్ బహదూర్ కాలువ సంబంధిత 132 మరియు 134 మైలు రాయి మధ్య గండి పడి, ఇందు మూలంగా వ్యవసాయ భూమికి త్రీవ నష్టం వాటిల్లింది. మరమ్మతు పనులు ప్రారంభించి కొన్ని రోజులు గడిచినప్పటికీ, ఇప్పటి వరకు ఈ భూమికి సంబంధించి సహాయక చర్యలు తీసుకోకపోగా, తెగిన కట్టను మరమ్మత్తు చేసే సదరు ప్రభుత్వ పెద్దలు మరియు కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవ్రతిస్తున్నారని తెలియజేస్తున్నాము. ఇంతవరకూ ఏటువంటి పురోగమనం లేకుండకపోగా, పనులు నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇందుకు ఎన్నో రకాలుగా రాజకీయ ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. దయచేసి ఇట్టి విషయాన్ని సదరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు మంత్రి మండలి చొరవ తీసుకొని, పనులు వేగంగా జరిపించి రైతులకు న్యాయం చేకూర్చాలని కొడుతున్న రైతు నీలకంఠం వెంకటేశ్వర్లు