schedule Saturday, August 22, 2026

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,,,

calendar_today September 25, 2024
person meenewstelugu
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,,,

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,,,

మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య::కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎల్ చరణ్ నాయక్ మీ న్యూస్ నూతనకల్ ,,వర్షాకాలపు సీజన్లో వచ్చే డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎల్ చరణ్ నాయక్ అన్నారు మంగళవారం మండల పరిధిలోని తాళ్ల సింగారం ఎడవల్లి ఎర్రపాడు గ్రామాలలో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ వర్ష కాలంలో వర్షాలు పడడం వలన మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమల స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అవి కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా వ్యాధి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఈ వర్ష కాలంలో నీరు కలుషితం కావడం వలన,కలుషితమైన ఆహారం పదార్థాలు , ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన , టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు, కలరా ఒంటివ్యాధులు సంభవిస్తాయని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, నీళ్ళు కాచి వడబోసి త్రాగాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు ..