డైనమిక్ స్కూల్ 2024 అవార్డు పొందిన అల్మాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అల్లాపూర్
calendar_today
September 26, 2024
person
meenewstelugu
డైనమిక్ స్కూల్ 2024 అవార్డు పొందిన అల్మాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అల్లాపూర్
విద్యార్థుల పలితాలు ,స్పోర్ట్స్ రంగంలో ప్రతిభ
మీ::న్యూస్ ప్రతినిధి
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో స్కూల్ అకాడమిక్ లో ఉత్తమ ఫలితాలను సేవలను అందిస్తున్న వారికి ఈ న్యూస్ ప్రవేట్ నెట్వర్క్ సంస్థ ప్రతి సంవత్సరం స్కూళ్లకు అవార్డులను అందిస్తుంది. ఈ క్రమంలో 2024 అవార్డుల ను హైదరాబాదులోని ట్రిడెంట్ హోటల్ హైటెక్ సిటీ నందు వేదిక ఏర్పాటు చేసి అవార్డులను పంపిణీ చేసింది. ఈ అవార్డులలో 2024 డైనమిక్ స్కూల్ అవార్డు తాండూరు పట్టణ సమీపంలో ఉన్న అల్మాస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు వరించింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు సమీపంలో ఉన్న అల్మాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అల్లాపూర్ నకు పదవ తరగతిలో అద్భుత ఫలితాలు అలాగే డైనమిక్ ఫీల్డ్ మరియు స్పోర్ట్స్ మొదలైన వాటిలలో విద్యార్థులకు అందించిన సేవలను గుర్తించి ఈ న్యూస్ నెట్వర్క్ సంస్థ డైనమిక్ స్కూల్ 2024 అవార్డుకు ఎంపిక చేసి అవార్డును అందజేసింది. ఈ అవార్డును స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అబ్దుల్ గఫార్ బుధవారం రాత్రి అందుకున్నారు. ఈ సందర్భంగా అల్మాస్ గ్రూప్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు ప్యాట్రన్ అల్హాజ్ తాహిర్ ఖురేషి, డైరెక్టర్లు మౌలానా,అబ్దుల్లాహ్ అజ్హర్ ఖాస్మీ, మౌలానా అబ్దుల్ రెహ్మాన్ అథ్హర్ ఖాస్మీలు లు స్కూల్ నిర్వహణ పట్ల అభినందించారు. స్కూల్లో టీచింగ్,నాన్ టీచింగ్ చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం అల్మాస్ స్కూల్ అన్ని సౌకర్యాలు అందించడంలో ముందుంటుందని అన్నారు. తల్లిదండ్రుల నమ్మకంతో విద్యార్థుల కృషితో ఇంత ఘనవిజయం సాధించడం జరిగిందని ఈ సందర్భంగా స్కూల్ నిర్వహకులు పేర్కొన్నారు. అల్మాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మూడు ఇంగ్లీష్ మీడియం తో పాటు ఒక జూనియర్ కళాశాలను కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు