schedule Tuesday, November 03, 2026

మునగాల గ్రామ, మండల ప్రజలకు విజ్ఞప్తి.....

calendar_today September 27, 2024
person meenewstelugu
మునగాల గ్రామ, మండల ప్రజలకు విజ్ఞప్తి.....

మునగాల గ్రామ, మండల ప్రజలకు విజ్ఞప్తి.....

మీ:: న్యూస్ ప్రతినిధి 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రవీందర్ గౌడ్::ఈనెల 29వ తేదీ ఆదివారం రోజు మునగాల హై స్కూల్ లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శoకర కంటి ఆసుపత్రి(హైదరాబాద్) మరియు సనేలా(Sanela) హెల్త్ వారి సహకారంతో మునగాల కు చెందిన సామాజిక సేవా కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ గంధం సైదులు అలియాస్ ఈనాడు సైదులు గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హించబడుతుంది. ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైన వారిని ఉచితంగానే బస్సులో హైదరాబాద్ తీసుకువెళ్లి ఆపరేషన్ తర్వాత తీసుకువస్తారు. మరియు వారికి భోజన వసతి కూడా కల్పిస్తారు. పరీక్షలు చేయించుకునేందుకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు తో పాటు సెల్ నెంబర్ ఒక జత బట్టలు మరియు గతంలో ఏదైనా జబ్బులకు సంబంధించి మందులు వాడుతున్నట్లయితే అట్టి మందుల రికార్డులు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.