రేపాలకు చెందిన బుర్రకథ కళాకారుడు మాచర్ల రామయ్య మృతి.....
calendar_today
September 27, 2024
person
meenewstelugu
రేపాలకు చెందిన బుర్రకథ కళాకారుడు మాచర్ల రామయ్య మృతి.....
మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బుర్రకథ కళాకారుడు,గ్రామవెలుగు నాట్యమండలి సీనియర్ కళాకారుడు,రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ మాజీ చైర్మన్ మాచర్ల రామయ్య(80) గుండెపోటుతో మరణించారు.చిన్ననాటి నుండే పల్లె కళల పట్ల మక్కువ కలిగిన మాచర్ల రామయ్య బుర్రకథలు,పల్లె పాటలు, పద్యాలు పాడుతూ కళా ప్రదర్శనలు ఇచ్చేవారని ఆనాటి తరంవారు చెబుతున్నారు.సొంతంగా పల్లె పాటలు రాసి రచయితగా కూడా గుర్తింపు పొందారని, గ్రామంలో జరిగే ఏ సామాజిక కార్యక్రమమైనా చురుగ్గా పాల్గొని పాట, మాటలతో అందరినీ ఆకట్టుకునేవారని, అలాగే ప్రసిద్ధ తెలంగాణ మాండలిక రచయిత క్రీ.శే.కె.ఎల్ రావు స్థాపించిన గ్రామ నాట్యమండలిలో సభ్యునిగా ఉంటూ అనేక నాటక ప్రదర్శనలు ఇస్తూ కళామతల్లికి తన సర్వస్వం అర్పించి,గ్రామంలో ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దినఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.ఒక మంచి కళాకారుని గ్రామం కోల్పోయిందని ఆయన మృతిపై గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేశారు.