schedule Tuesday, August 25, 2026

నాగసముందర్ గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

calendar_today September 28, 2024
person meenewstelugu
నాగసముందర్ గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
[caption id="attachment_1675" align="aligncenter" width="640"] నాగసముందర్ గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి[/caption]

బిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి

మీ:: న్యూస్ ప్రతినిధి ::వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని నాగసముందర్ గ్రామంలో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు బిడ్జి నిర్మాణం చేపట్టాలని నేడు CPM ఆధ్వర్యంలో రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్ళే దారిని సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా CPM జిల్లా కార్యవర్గ సభ్యులు కే. శ్రీనివాస్,యు.బుగ్గప్ప, MSP జిల్లా నాయకులు డి. మహేందర్ మాట్లాడుతూ...యాలాల మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలోని రైతులు వారి పంట పొలాలకు వెళ్లేందుకు వర్షంకాలం తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుంది,సుమారు 500మంది రైతులు ప్రతిరోజు పంట పొలాలకు రాకపోకలు చేస్తుంటారు,శివసాగర్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ నిల్వడం వలన వాగు దాటాని అంటే రైతుల గోస వర్ణనతీతంగా ఉందాన్నారు. రైతులు వాగు దాటాడానికి ప్లాస్టిక్ డ్రమ్ములతో చేసిన పడవలల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది అని లేదంటే 20కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాలలి,

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్ల రైతులు ఉన్నతఅధికారులకు, పాలకులకు విన్నవించిన రైతులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు,
రైతే రాజు అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వలు మరి నాగసముందర్ రైతులు అనేక రోజులుగా పడుతున్న ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా అని ప్రభుత్వన్ని ప్రశ్నించారు.ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాగసముందర్ గ్రామ రైతులు ఎదురుకోటున్న బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలని, వెంటనే సమస్య పరిష్కారం కు కృషి చేయాలనీ లేకుంటే రైతులతో కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన, పోరాటం నిర్వహిస్తమని ప్రభుత్వన్ని హెచ్చరించారు.