schedule Tuesday, August 25, 2026

హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్.. రంగనాథ్ పై హైకోర్టు సీరియస్..!

calendar_today October 1, 2024
person meenewstelugu
హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్.. రంగనాథ్ పై హైకోర్టు సీరియస్..!

హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్.. రంగనాథ్ పై హైకోర్టు సీరియస్..!

మీ::న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్::హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా పేరుతో కూల్చివేతల సందర్భంగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా సోమవారం హైడ్రా పై హైకోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా కోర్టుకు హాజరు కావాలని నోటీసు జారీ చేసిన పక్షంలో సోమవారం ఆయన హైకోర్టుకు హాజరయ్యారు.కాగా రంగనాథ పై హైకోర్టు సీరియస్ అయింది. సెలవు దినాల్లో కూడా ఇల్లు ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించింది. హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏంటి అని ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా..? లేక లక ఫాలో అవుతున్నారా..? అంటూ నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తారో చెప్పాలని సీరియస్ అయ్యింది.