మీ:: న్యూస్ ప్రతినిధి::తాండూరు రూరల్ గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జోరి వీరేశం ఇంటివద్ద పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ 33 వేల 250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.తాండూర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన జ్యోరి వీరేశం ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదిగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందంతో కలిసి ఆ ఇంట్లో సోదా చేయగా ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించమన్నారు. అందులో పేకాట ఆడుతున్న వారిలో కొండ్ల నరేందర్,కులకర్ణి రాఘవేందర్, కురువ మల్లికర్జున్, సల్వా నర్సిములు,కుమ్మరి జగదీష్, బుట్ట వినోద్,లు పేకాట ఆడుతున్నట్లు గుర్తించమన్నారు. మరో వ్యక్తి జోర్ని వీరేశం పరారు లో ఉన్నారని తెలిపారు.దీంతో పేకాట ముక్కలతోపాటు రూ. 33వేల 250 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.రానున్న దసరా,దీపావళి పండుగల సందర్భంగా కొంతమం ది పేకాట విచ్చల విడిగా ఆడేందుకు తెరలేపుతున్నారని, వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడ పేకాట ఆడినా తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.