schedule Saturday, June 13, 2026

సెలవు దినంగా ప్రకటించాలి

calendar_today February 15, 2024
person meenewstelugu

సెలవు దినంగా ప్రకటించాలి

- సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు అర్పించిన విట్టల్ నాయక్

దీక్షతెలుగు న్యూస్, తాండూరు :
బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ డిమాండ్ చేశారు.తాండూరు పట్టణంలో బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ పక్కనఉన్న సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి విట్టల్ నాయక్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విట్టల్ నాయక్ మాట్లాడుతూ..గిరిజనుల అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు. సేవా లాల్‌ జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 500 మంది జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా గుర్తించిందన్నారు.మిగిలిన తండాలను కూడా పంచాయతీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.