schedule Monday, August 24, 2026

వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

calendar_today October 2, 2024
person meenewstelugu
వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

- డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్ర 

- పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన 

- సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్::సిద్దిపేట జిల్లా : అక్టోబర్02, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం ) వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి గ్రామ పంచాయతీ కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీజీ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ప్రవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది అ మహాత్ముని బాటలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. గత పదిహేను ఏళ్ళు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజుని ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సదానందం, మాజీ సర్పంచ్ తోట ఆంజనేయులు,ఉపాధి క్షేత్ర సిబ్బంది జక్కుల సౌభాగ్య, మహిళా అధ్యక్షులు అట్లా స్వాతి, అంగన్వాడీ టీచర్ బీ జ్యోష్ణ,ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు ,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.