ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలి
calendar_today
October 3, 2024
person
meenewstelugu
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలి
షక్ సోహేల్ మండల యువ నాయకులు
మీ:: న్యూస్ ప్రతినిధి ఎండీ ఖలీల్::ఝరాసంఘం. ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని 70 సంవత్సరాల నిండిన వృద్ధ రైతులకు అందరికీ పంట రుణాలు ఇవ్వాలని రైతు బీమా ఇన్సూరెన్స్ రుసుము వెంటనే చెల్లించాలని రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధువు వారి ఖాతాలోనే వెంటనే జమ చేయాలని రైతులకు రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల యువ నాయకులు షేక్ సోహేల్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఏ గ్రామంలో కూడా 100% రుణమాఫీ జరగలేదని అన్నారు