మీ న్యూస్ ప్రతినిధి అనంతులు చంద్రయ్య::మద్ధిరాల : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తుల నుండి విశేష పూజలు అందుకునేందుకు గురువారం దుర్గామాతలు కొలువుదీరారు. దుర్గామాతను ప్రతిష్టించేందుకుగాను మండపాలను,విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారు మొదటి రోజు బాల త్రిపురసుందరిగా దర్శనమిచ్చింది. మద్దీరల మండల కేంద్రంలోని చిన్ననేమిల గ్రామం లో భవాని యూత్ అససియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాతనూ ప్రతిష్టించారు.అమ్మవారుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చిర్ర రాజశేఖర్ , దబెట్టి మహేష్ , విరబోయిన రాజు, మటపల్లి కర్ణకర్, అనంతుల వంశీ, రావుల మహేష్, కుందేన శేఖర్, యాట గణేష్, రావుల వంశీ, చీమల గణేష్, చిర్ర బువన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.