schedule Tuesday, August 25, 2026

సూర్యాపేట ఆరె కటిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

calendar_today October 4, 2024
person meenewstelugu
సూర్యాపేట ఆరె కటిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట ఆరె కటిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షుడిగా జమల్ పురి పండరినాథ్

ప్రధానకార్యదర్శిగా జమల్ పురి రవీందర్

   

మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్

మీ::న్యూస్ అక్టోబర్ 4::సూర్యాపేట: సూర్యాపేట ఆరె కటిక సంఘం( మాంస దుకాణం దారుల సంక్షేమ సంఘం రిజిస్టేషన్ నెంబర్ 4332/92) నూతన కార్యవర్గాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని పద్మశాలిభవనంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం పట్టణ కమిటీ అధ్యక్షులుగా జమల్ పురి పండరినాథ్, ప్రధాన కార్యదర్శిగా జమల్ పురి రవీందర్, గౌరవ అధ్యక్షులుగా కామ్లేకర్ శంకర్ లాల్, జమల్ పురి సజన్ లాల్, ఉపాధ్యక్షులుగా కె విఠల్, కోశాధికారిగా సురేష్, సహాయ కార్యదర్శిగా కె రఘుమోహన్, కార్యవర్గ సభ్యులుగా జమల్ పురి రాజేష్, విజయ్, సంతోష్, శివ, శేఖర్, టి శ్రీనివాస్, మహేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జమల్ పురి పండరినాథ్ మాట్లాడుతూ ఆరె కటికల మాంసం దుకాణదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో అశోక్, రామచందర్, బాబి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు