schedule Tuesday, August 25, 2026

నూతనకల్ లో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

calendar_today October 4, 2024
person meenewstelugu
నూతనకల్ లో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నూతనకల్ లో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నూతనకల్ మీ న్యూస్ ప్రతినిధి అనంతులు చంద్రయ్య

మీ న్యూస్ నూతనకల్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తుల నుండి విశేష పూజలు అందుకునేందుకు గురువారం దుర్గామాతలు కొలువుదీరారు.మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉత్సవ కమిటీలు దుర్గామాతను ప్రతిష్టించేందుకుగాను మండపాలను,విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు.అమ్మవారు బాల త్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. భక్తులు దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.మండల కేంద్రంలోని శ్రీ మాత ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాతకు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి కరుణ శ్రీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మారగాని రమేష్,ఇ మ్మారెడ్డి మహేష్ రెడ్డి, బొడ్డుపల్లి ఉదయ్, బత్తిని మనోజ్, కాముని కిరణ్, శ్రావణ్, మహేష్,చింటు, సాయి తదితరులు పాల్గొన్నారు.